అదుపులోనే కరోనా వైరస్
భారత్ లో ఒక్కరోజులో 1.87 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 2,468 మందికి కరోనా వైరస్ గా నిర్ధారణ అయింది
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనపడుతుంది. భారత్ లో ఒక్కరోజులో 1.87 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 2,468 మందికి కరోనా వైరస్ గా నిర్ధారణ అయింది. నిన్న రెండువేలకు లోపు నమోదయిన కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. దేశంలో కరోనా వ్యాప్తి కొంత అదుపులో ఉందని అయినా కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ....
వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ దేశంలో 4.50 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 44039883 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 5,27,733 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం 33, 318 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ 2,18,83,40,816 దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.