భారత్ లో కరోనా అప్‌డేట్
భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకూ భారత్ లో 5,28,611 మంది కరోనాతో మరణించారు
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఐదు వేల కంటే తక్కువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 4,272 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులోనే 4,474 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.72 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.09 శాతంగా నమోదయింది.
యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకూ భారత్ లో 5,28,611 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 40,750 వరకూ ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 218 కోట్ల మేరకు కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.