భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో ఒక్కరోజులో 5,379 కరోనా వైరస్ బారిన పడ్డారు. 27 మంది కరోనా కారణంగా మరణించారు.
భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసుల సంఖ్య కొంత పెరిగింది. ఒక్కరోజులో 5,379 కరోనా వైరస్ బారిన పడ్డారు. 27 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులోనే 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 0.11 శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
రికవరీ రేటు...
ఇక కరోనా రికవరీ రేటు 98.7 శాతానికి పెరిగింది. భారత్ లో ఇప్పటి వరకూ 4,44,72,241 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,38,93,590 మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,28,030 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 50,594 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 213.91 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.