కన్నడ ఎన్నికల్లో నాటు నాటు

కర్ణాటక ఎన్నికల్లోనూ బీజేపీ తెలుగు పాటను రీ మిక్స్ చేసి ప్రచారంలో ఉపయోగిస్తుంది. నాటు నాటు పాట ను రీమిక్స్ చేసింది

Update: 2023-04-12 05:14 GMT

ఏ ఎన్నికలు జరిగినా తెలుగు పాటకు జాతీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. వాటిని రీ మిక్స్ చేస్తూ జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలోనూ అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అనేక తెలుగు సినిమా పాటలకు సంబంధించి రీమిక్స్ చేసి ప్రజల్లోకి విడుదల చేయడం మామూలుగా మారిపోయింది. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ లు అనేక తెలుగు పాటలు రీమిక్స్ చేశారు. బాహుబలి సినిమా పాటలను కూడా ఎన్నికల సందర్భంగా వాడుకున్నారు.

ప్రచారంలో తెలుగుపాటను...
తాజాగా కర్ణాటక ఎన్నికల్లోనూ బీజేపీ తెలుగు పాటను రీ మిక్స్ చేసి ప్రచారంలో ఉపయోగిస్తుంది. నాటు నాటు పాట ను రీమిక్స్ చేస్తూ ప్రజలకు దగ్గరగా కన్నడ రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి చేసిన అంశాలను ఈ పాట ద్వారా ప్రచారంలో వినియోగిస్తున్నారు. కర్ణాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా నాటు నాటు పాటను రీమిక్స్ చేసి ప్రచారంలో ఉపయోగిస్తున్నారు. కన్నడ భాషలో రూపొందించిన ఈ పాట ప్రజలను ఆకట్టుకుంటుంది. ప్రచారంలో ముందుంటున్న బీజేపీ నాటు నాటు పాటను రీమిక్స్ చేసింది. నాటు నాటు పాటకు ఇటీవల ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News