"గెటవుట్ రవి".. తమిళనాడులో కలకలం
తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరింది
తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తమిళనాడు మార్పుపై దుమారం చెలరేగింది. తమిళనాడు పేరును గవర్నర్ పేరు మార్చాలని అన్నారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రసంగం కాపీని చదవకుండా తన సొంతంగా కొన్ని పదాలను వాడటంపై ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో గొడవ చేయడంతో గవర్నర్ రవి బడ్జెట్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
చెన్నైలోని పలు ప్రాంతాల్లో...
ఈ సందర్భంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో గెటవుట్ రవి అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి. గవర్నర్ కేవలం ప్రభుత్వాన్ని ఇరకాటంోకి పెట్టేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, అనేక ఫైళ్లన పెండింగ్ లో పెడుతున్నారని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తుంది. గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కోరుతుంది. తాజాగా గవర్నర్ రవిని గెటవుట్ అంటూ పోస్టర్లు వేసి రాజ్‌భవన్ ను మరోసారి ప్రజల్లోకి లాగింది.