క్లాస్ రూమ్ లోనే మహిళ ప్రొఫెసర్ పెళ్లి తంతు
పశ్చిమ బెంగాల్ లో క్లాస్ లోనే ప్రొఫెసర్ ఒక విద్యార్థిని వివాహం చేసుకున్న ఘటన వైరల్ గా మారింది;

పశ్చిమ బెంగాల్ లో క్లాస్ లోనే ప్రొఫెసర్ ఒక విద్యార్థిని వివాహం చేసుకున్న ఘటన వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్ లోని మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో క్లాస్ లోనే ఒక సీనియర్ మహిళ ప్రొఫెసర్ తన తరగతిలో ఉన్న ఒక విద్యార్థిని వివాహం చేసుకున్నారు. ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తరగతి గదిలో ఈ పెళ్లేమిటంటూ ఆరీ తీశారు. అయితే ఆ మహిళ ప్రొఫెసర్ మాత్రం దీనిని చాలా తేలిగ్గా తీసుకున్నారు.
సైకో డ్రామాగా...
ఇదంతా ఒక డ్రామా అని కొట్టి పారేశారు. సైకో డ్రామా ప్రదర్శనలో భాగంగా విద్యార్థులకు అవగాహన కోసం ఈ ప్రదర్శన చేశామని ప్రొఫెసర్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు వివరణ కోరగా అందుకు సమాధానం ఇచ్చినా విచారణ ముగిసేంత వరకూ సెలవుపై వెళ్లాలని ఉన్నతాధికారులు ప్రొఫెసర్ ను ఆదేశించారు. నవ వధువులా అలంకరించుకుని ప్రొఫెసర్ పెళ్లి తంతు వైరల్ గా మారడంతో నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.