బైజూస్‌పై ఐటీ దాడులు
బైజూస్ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బైజూస్ సీఈవో రవీంద్ర ఇల్లు, కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయి
బైజూస్ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బైజూస్ సీఈవో రవీంద్ర ఇల్లు, కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయి. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్, హవాలా నిబంధనలు ఉల్లంఘనల కింద ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
నాలుగు రాష్ట్రాల్లో...
బెంగళూరులో పది చోట్ల, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణలో ఆరు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి ఈ తనిఖీలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.