ముగుస్తోన్న ఆధార్-పాన్ గడువు.. ఇంకా లింక్ అవ్వడం లేదా ? ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి

పాన్ - ఆధార్ కార్డులు లింక్ కాకపోవడానికి ఈ అంశాలు కారణం కావొచ్చని ఆదాయపు పన్నుశాఖ అంచనా వేస్తోంది. ఇందుకు చాలా కారణాలు..

Update: 2023-06-28 12:37 GMT

pan - aadhar link solution

దేశంలో పాన్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ.. దానిని తమ ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని ఇన్ కంటాక్స్ శాఖ తప్పనిసరి చేసింది. 1961 చట్టం ప్రకారం ప్రతి పాన్ కార్డు ఉన్న వ్యక్తి ఆధార్ తో అనుసంధానం చేయాల్సిందే. ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పెంచిన ఇన్ కంటాక్స్ శాఖ.. చివరి అవకాశంగా.. జూన్ 30 వరకూ లింక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. రెండురోజుల్లో ఈ గడువు కూడా పూర్తి కానుంది. న్ని సార్లు గడువు పొడిగించినా ఇంకా ఆధార్ కార్డుతో అనుసంధానం కాని పాన్ కార్డులు లక్షల్లో ఉన్నాయని ఇన్‌కంటాక్స్ శాఖే చెబుతోంది. ఇప్పటికీ ఎంతప్రయత్నించినా పాన్ తో ఆధార్ లింక్ కాని వారు ఒక్కసారి ఈ అంశాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

పాన్ - ఆధార్ కార్డులు లింక్ కాకపోవడానికి ఈ అంశాలు కారణం కావొచ్చని ఆదాయపు పన్నుశాఖ అంచనా వేస్తోంది. ఇందుకు చాలా కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా డెమోగ్రఫిక్ వివరాలు సరిగ్గా లేకపోతే లింక్ పూర్తి కాదని సదరు శాఖ వివరించింది. ఇక పేరు, పుట్టిన తేదీ, జెండర్ విషయంలో తప్పులున్నా లింకింగ్ ఆగిపోతుంది. పాన్ కార్డు - ఆధార్ కార్డుల్లో అన్నీ ఒకేలా ఉండేలా సరి చేసుకోవాలని సూచించింది. పాన్ కార్డులో మార్పులు చేర్పులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో చేసుకోవచ్చు. అదే ఆధార్ కార్డులో మార్పుల్ని సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి చేసుకోవాలి. అప్పటికీ లింక్ కాకపోతే పాన్ సర్వీసు కేంద్రాల్లో 50 రూపాయలు చెల్లించి బయోమెట్రిక్ అథెంటిఫికేషన్‌తో చేసుకోవాలి.
ఆదార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేయకపోతే జూలై 1 నుంచి పాన్ కార్డు నిరుపయోగమైపోతుందని ఐటీ శాఖ మరోసారి స్పష్టం చేసింది. 2023 ఫిబ్రవరి నాటికి 13 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ కాలేదు. ఇప్పటికీ లక్షల్లో పాన్ కార్డులు..ఆధార్ కార్డులతో లింక్ కాకుండా మిగిలిపోయాయి. పాన్ కార్డు - ఆధార్ కార్డుతో లింక్ కాకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కష్టం. జూలై 31 వరకూ ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశమున్నందున పాన్ కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ గడువు మరో నెల రోజులు పెంచవచ్చని కొందరు అంటుంటే.. మరోసారి గడువు పొడిగించే పరిస్థితి లేదని సదరు శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News