H3N2పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలు

తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలు జారీ చేసింది. H3N2ని సీజనల్ వ్యాధిగా పేర్కొంటూ..

Update: 2023-03-11 08:11 GMT

icmr guidelines for h3n2

యావత్ దేశాన్నీ ఇప్పుడు H3N2 ఇన్ ఫ్లూయెంజా కలవరపెడుతోంది. ఆస్పత్రులన్నీ జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం త్వరగానే తగ్గినా, దగ్గుమాత్రం మూడు వారాలు ఉంటుండటంతో.. H3N2గా భావించాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ఈ H3N2వైరస్ పట్ల అంతా ఆందోళన చెందుతుండటంతో తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలు జారీ చేసింది. H3N2ని సీజనల్ వ్యాధిగా పేర్కొంటూ.. ఏడాదిలో రెండుసార్లు వ్యాపిస్తాయని తెలిపింది. ఈ కేసులు మార్చి నెలాఖరులోగా తగ్గుముఖం పడుతాయని పేర్కొంది. కానీ.. దానిపట్ల అలసత్వం తగదని, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు అధిక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడే వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది. వీలైనంతవరకూ రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడం మేలని పేర్కొంది. అలాగే బయటకు వెళ్లేటపుడు మాస్క్ ని ఖచ్చితంగా ధరించాలని సూచించింది. దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కుతో పాటు నోటిని కూడా కవర్ చేసుకోవాలి. చేతులతో కళ్ళు, ముక్కును పదేపదే తాకరాదు. ఆహారానికి ముందు చేతులను హ్యాండ్ వాష్ తో కడుక్కోవాలి. జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు తదితర లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వంటివి చేయకూడదు. వైద్యుల సూచనలు లేకుండా.. యాంటి బయోటిక్ మందులను వాడరాదని ఐసీఎంఆర్ తెలిపింది.


Tags:    

Similar News