బెంగాల్ రైలుప్రమాదం : మృతులకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా

పశ్చిమ బెంగాల్ లో నిన్న సాయంత్రం బికనీర్ - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో

Update: 2022-01-14 04:56 GMT

పశ్చిమ బెంగాల్ లో నిన్న సాయంత్రం బికనీర్ - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. డొమోహని వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాద ఘటనలో గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు భారతీయ రైల్వే సంతాపం తెలియజేసింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు అందించనున్నట్లు భారతీయ రైల్వేశాఖ తెలిపింది.

రైలు పట్టాలు తప్పి, ఇంత ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని.. ప్రస్తుతం రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలపై దృష్టి సారించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. నేడు ప్రమాద ప్రాంతానికి వెళ్లి.. పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు గౌహతి చీఫ్ పీఆర్వో గునీత్ కౌర్ తెలిపారు.



Tags:    

Similar News