పొగమంచు.. విమానాలు, రైళ్ల రాకపోక ఆలస్యం
ఉత్తరాదిన చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మంచు కురుస్తుండటంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఉత్తరాదిన చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మంచు కురుస్తుండటంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పొగమంచు కారణంగా రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ప్రజలు ఉదయం పది గంటల వరకూ బయటకు రావడానికి భయపడి పోతున్నారు. విపరీతమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
చలి తీవ్రతకు...
ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. రహదారులపై దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు నెమ్మదిగా వెళుతున్నారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలిగాలుల కారణంగా అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.