పీఎస్ఎల్వీ సీ 54 సక్సెస్

పీఎస్ఎల్వీ సీ 54 విజయవంతం అయిందని శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

Update: 2022-11-26 06:58 GMT

పీఎస్ఎల్వీ సీ 54 విజయవంతం అయిందని శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాలను మోసుకుని పీఎస్ఎల్వీ సీ 54 కక్షలోకి ప్రవేశించిందని చెప్పారు. కక్షలోకి తొమ్మిది ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ 54 వాహన నౌక తీసుకెళ్లిందని తెలిపారు. ఐదు సంవత్సరాలు ఈ ఉపగ్రహం మనకు సేవలందిస్తుందని తెలిపారు.

సురక్షితంగా...
కక్షలోకి ఓషన్ శాట్ తో పాటు ఎనిమిది ఉపగ్రహాలు సురక్షితంగా వెళ్లాయని పేర్కొన్నారు. ఓషన్ శాట్ 2 తో ఓషన్ శాట్ 3 అనుసంధానం కానుందని తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు అభినందనలు తెలుపుకున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ సయితం ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలను తెలిపారు.


Tags:    

Similar News