పార్లమెంటు పై దాడికి 20 ఏళ్లు
భారత పార్లమెంటుపై ఉగ్రమూకలు దాడికి పాల్పడి ఇరవై ఏళ్లయింది. ఇదే రోజు 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
భారత పార్లమెంటుపై ఉగ్రమూకలు దాడికి పాల్పడి ఇరవై ఏళ్లయింది. సరిగ్గా ఇదే రోజు 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పది మంది జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన జరిగి ఇరవై ఏళ్లు కావస్తుంది. దాడి తర్వాత పార్లమెంటుకు మరింత భద్రతను పెంచారు.
అమరులకు....
ఈ సందర్బంగా అమరులైన జవాన్లకు భారత్ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులు నివాళుర్పించారు. సైనికుల త్యాగాలు మరువలేనివన్నారు. ఉగ్రవాదం మానవాళికి, ప్రపంచ శాంతికి ముప్పు అని పేర్కొన్నారు. ప్రపంచదేశాలన్నీ కలసి ఉగ్రవాదాన్ని అరికట్టుందుకు ఐక్యంగా పనిచేయాలని కోరారు. అమరులకు ఘన నివాళులర్పించారు.