విద్యాసంస్థలకు నేడు సెలవు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్థంభించి పోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్థంభించి పోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షం కారణంగా పుదుక్కొట్టై జిల్లాలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు సమీపానికి రావడంతో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలతో...
తమిళనాడును ఇటీవల కాలంలో వర్షాలు వీడటం లేదు. వరస వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెన్నై నగరంతో పాటు పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ప్రాజెక్టులు అన్నీ నిండిపోయాయి. వాగులు, వంకలు నిండాయి. రహదారులు నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.