నేడు ఉప రాష్ట్రపతిగా జగదీప్ ‌ధన్‌కర్

నేడు ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయిస్తారు

Update: 2022-08-11 04:17 GMT

నేడు భారత ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. తొలుత రాజ్‌ఘాట్ కు వెళ్లి జగదీప్ ధన్‌ఖర్ మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెంకయ్య నాయుడు పదవీకాలం నిన్నటి తో ముగియడంతో నేటి నుంచి జగదీప్ థన్‌ఖర్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరు కానున్నారు.

కుగ్రామంలో జన్మించిన...
జగదీప్ ‌ధన్‌కర్ 1951 మే 18వ తేదీన రాజస్థాన్ లోని ఒక కుగ్రామంలో జన్మించారు. సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన అనంతరం ఎల్ఎల్‌బీ చదవివారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1989 నుంచి 1991 వరకూ లోక్ సభ సభ్యుడిగా పనిచేసిన ధన్‌ఖర్ అంతకు పూర్వం ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులైన జగదీప్ ‌ధన్‌కర్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యేంత వరకూ పనిచేశారు.


Tags:    

Similar News