పాపం ఎమ్మెల్యే చేతుల్లో దెబ్బలు తిన్న ప్రిన్సిపాల్
అందరూ చూస్తూ ఉండగానే చెంపదెబ్బలు కొట్టడానికి ప్రయత్నించాడు
పవర్ ఉంది కదా ఇష్టానుసారం ప్రవర్తించడం చాలా తప్పు. ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అలా ఓ ఎమ్మెల్యే అందరూ చూస్తూ ఉండగానే చెంపదెబ్బలు కొట్టడానికి ప్రయత్నించాడు. చివరికి చెంప దెబ్బలు కొట్టనే కొట్టాడు. కర్ణాటకలోని జనతాదళ్ (సెక్యులర్) శాసనసభ్యుడు కంప్యూటర్ ల్యాబ్ కోసం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయిన కళాశాల ప్రిన్సిపాల్‌ని కొట్టారు. జూన్ 20వ తేదీ సోమవారం జరిగిన ఈ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది.
నల్వడి కృష్ణరాజ వడియార్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌పై మండ్య ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ పలుమార్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్ పట్ల శ్రీనివాస్ ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారని ప్రజలు మండిపడ్డారు. పునరుద్ధరించిన ఐటీఐ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా ల్యాబొరేటరీలో జరుగుతున్న పనులపై ప్రిన్సిపల్ నాగనాద్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. JD(S) MLA అతనిని తిట్టాడు. అనుచరుల ముందు రెండుసార్లు కొట్టాడు. ఎమ్మెల్యేను శాంతింపజేసేందుకు అక్కడి వారు ప్రయత్నించారు.
ఈ విషయాన్ని జిల్లా కమీషనర్ దృష్టికి తీసుకెళ్తామని జూన్ 21వ తేదీ మంగళవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మండ్య జిల్లా అధ్యక్షుడు శంభుగౌడ్ తెలిపారు. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్‌పై దాడికి సంబంధించిన వివరాలను తీసుకున్నారు. ప్రిన్సిపాల్ నాగానంద్‌ను కూడా కలిసి సంఘటన వివరాలను తెలుసుకుని పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.