దేశంలో తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్ జంట
జియా అమ్మాయిలా మారకముందే.. అతని వల్ల జహద్ గర్భం దాల్చింది. ఈరోజు కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జహద్ బిడ్డకు..
దేశంలో తొలిసారి ట్రాన్స్ జెండర్స్ అయిన జహద్, జియా పావల్ జంట బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజుల క్రితమే ఈ జంట త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ వార్తలొచ్చాయి. తాజాగా జహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా వెల్లడించింది. అయితే తమ బిడ్డ జెండర్ ఏంటనేది మాత్రం ఈ జంట చెప్పలేదు. అబ్బాయిగా పుట్టిన జియా అమ్మాయిలా మారగా.. జహద్ గర్భం కోసం అమ్మాయిగానే ఉండిపోయింది.
జియా అమ్మాయిలా మారకముందే.. అతని వల్ల జహద్ గర్భం దాల్చింది. ఈరోజు కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జహద్ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజుల్లోనే జహద్ అబ్బాయిగా మారనుంది. కాగా.. వీరిద్దరూ ఒకరి జెండర్ ఒకరు మారాల్సిన అవసరం ఏముంది. అలాగే ఉండి పెళ్లి చేసుకోవచ్చుగా అన్న వాదన కూడా అప్పట్లో వచ్చింది. ఏదేమైనా తొలిసారి ఓ బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్ జంటగా.. జియా-జహద్ లు రికార్డు సృష్టించారు.