గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఇలా !
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది. వరంగల్, విజయవాడ, తిరుపతి..
బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు సహజం. ఒకరోజు ధర పెరిగితే.. మరో రోజు ఊహించనంతలా ధర పడిపోతుంటుంది. ఒక్కోసారి ధరలు నిలకడగానే కొనసాగుతుంటాయి. వరసగా రెండో రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ఆదివారం ఉదయం 6 గంటల వరకూ నమోదైన వివరాల మేరకు.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది. వరంగల్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. కిలో వెండి ధరపై రూ.400 పెరగడంతో.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,500గా ఉంది. రెండురోజుల్లోనే వెండి ధర రూ.2000 మేర పెరగడంతో.. త్వరలోనే బంగారం ధర కూడా పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.