తదుపరి సీజేఐ కోసం...?
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును పరిశీలిస్తున్నారు.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన పేరే సీజేఐ పదవికి ఖారారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తర్వాత సీనియర్ గా జస్టిస్ డివై చంద్రచూడ్ ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎవరికి అవకాశం ఇవ్వాలో చెప్పాలని సీజేఐకి లేఖ రాసింది. సంప్రదాయంగా ఇదే విధానం కొనసాగుతుంది. ఆయన పేరునే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత సీజేఐ సూచించే అవకాశాలున్నాయి.
వచ్చే నెల 8న ....
వచ్చే నెల 8వ తేదీన ప్రస్తుత చీఫ్ జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీజేఐ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే పేరును సూచించమని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుత సీజేఐగా జస్టిస్ లలిత్ కేవలం మూడు నెలలే పదవిలో ఉంటారు. అనంతరం కొత్త సీజేఐ వస్తారు. నెల రోజుల సమయం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రక్రియను ప్రారంభించింది.