భవిష్యత్‌లో కరోనా వేవ్‌లు తప్పవు
భవిష్యత్ లో మరిన్ని కరోనా వేవ్‌లు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి కాన్ కెర్ఖోవ్ తెలిపారు
భవిష్యత్ లో మరిన్ని కరోనా వేవ్‌లు తప్పవని ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి కాన్ కెర్ఖోవ్ తెలిపారు. ప్రపంచంలో 500 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయన్నారు. ఇవి ప్రపంచంలోని అనేక దేశాల్లో తిష్ట వేసి ఉన్నాయని ఆయన తెలిపారు. చైనాలో కేసులు భారీ సంఖ్యలో వెలుగు చూడటం ఆందోళన కల్గించే విషయమని ఆయన అన్నారు. అనేక దేశాలు ఆంక్షలు సడలించడంతో కేసులు సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు.
జనవరి నెలలో...
జనవరి నెలలో భారీగా కరోనా కేసులు పెరిగే అవకాశముందని కాన్ కెర్ఖోవ్ చెప్పారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం వల్ల కొంత కేసుల సంఖ్య తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ లో రానున్న నలభై రోజులు కీలకమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.