కోడిమాంసం కొనడానికి వెళ్లి కోటీశ్వరుడైన పెయింటర్
కోడిమాంసం కొనేందుకు కొట్టుకువెళ్లిన అతడు.. కోటీశ్వరుడవుతాడని కలలో కూడా ఊహించలేదట. కేరళలోని కొట్టాయంకు సమీపంలో కుడయంపడి;
ఓ సాధారణ పెయింటర్ ను అదృష్టలక్ష్మి వెతుక్కుంటూ వచ్చింది. కోడిమాంసం కొనేందుకు కొట్టుకువెళ్లిన అతడు.. కోటీశ్వరుడవుతాడని కలలో కూడా ఊహించలేదట. కేరళలోని కొట్టాయంకు సమీపంలో కుడయంపడి ప్రాంతంలో నివసించే సదానందన్ పెయింటింగ్ కార్మికుడు. ప్రతిరోజూ రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. ఆదివారం సదానందన్ చికెన్ తీసుకొచ్చేందుకు మార్కెట్ కు వెళ్లాడు. అతనివద్ద రూ.500 నోటు ఉండటంతో.. చికెన్ షాపువాడు చిల్లర ఇస్తాడో లేదోనని సందేహించి.. సమీపంలోనున్న లాటరీ టికెట్ల దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడొక లాటరీ టికెట్ కొని.. చిల్లర తీసుకుని, చికెన్ కొనుక్కుని ఇంటికెళ్లాడు.
Also Read : ఏపీలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు
ఇటీవల క్రిస్మస్ - కొత్త సంవత్సరం సీజన్ ను పురస్కరించుకుని బంపర్ లాటరీ ప్రకటించారు. ఆ లాటరీనే సందానందన్ కొన్నాడు. ఇప్పుడా లాటరీ టికెట్ కు రూ.12 కోట్ల బంపర్ ప్రైజు తగిలింది. తన దశ ఇలా తిరుగుతుందని కల్లో కూడా ఊహించని సదానందన్.. ఒక్కసారిగా కోటీశ్వరుడు కావడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇప్పుడు కుడయంపడిలో సందానందన్ పేరు మార్మోగిపోతోంది. లాటరీ డబ్బుతో ఏంచేస్తావని సదానందన్ ను ప్రశ్నించగా, సరైన ఇల్లు కట్టుకుంటామని, మిగతా డబ్బును కొడుకులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉండేందుకు వెచ్చిస్తానని వెల్లడించాడు.