కేరళ బీజేపీ చీఫ్ పై ఈ ఆరోపణలు అవేనా?

కేరళ బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ పై బంధుప్రీతి ఆరోపణలు వచ్చాయి. తన కుమారుడికి ఆర్‌జీసీబీ లో ఆఫీసర్ గా ఉద్యోగం ఇప్పించారు

Update: 2022-09-05 08:40 GMT

కుటుంబ రాజకీయాలకు బీజేపీ దూరమంటుంది. అవినీతిని తాము సహించమని చెబుతుంది. మోదీ నుంచి గల్లీ స్థాయి నాయకుల వరకూ కుటుంబ పార్టీలకు దూరమని పైకి చెబుతారు. కానీ జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కేరళ బీజేపీ బంధుప్రీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. కేరళ బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ పై ఈ ఆరోపణలు వచ్చాయి. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో సురేంద్రన్ తన కుమారుడు హరికృష్ణన్ టెక్నికల్ ఆఫీసర్ గా నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇతర అభ్యర్థులను కాదని...
పరీక్షల తర్వాత ఇతర అభ్యర్థులను కాదని హరికృష్ణన్ ను ఈ పోస్టుకు ఎంపిక చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. తిరువనంతపురంలోని ఆర్‌జీసీబీ లో టెక్నికల్ ఆఫీసర్ గా రాధాకృష్ణన్ ను నియమించడాన్ని రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి. మెరిట్ ఆధారంగా కాకుండా సిఫార్సుతోనే ఆయన నియామకం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News