మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ సభ
వచ్చే నెల 5వ తేదీ మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. పెద్దయెత్తున జనసమీకరణ చేయనున్నారు
ఆర్ఎస్ స్పీడ్ పెంచుతుంది. వరసగా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖమ్మం సభ విజయవంతం కావడంతో వరస సభలకు ప్లాన్ చేస్తుంది. వచ్చే నెల 5వ తేదీ మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. పెద్దయెత్తున జనసమీకరణ చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ జిల్లాల నుంచి నాందేడ్ కు జనాన్ని తరలించే ఏర్పాట్లకు సన్నాహాలు మొదలయ్యాయి.
సభ ఏర్పాటుకు...
ఇప్పటికే నాందేడ్ సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిని ఇన్‌ఛార్జిగా కేసీఆర్ నియమించారు. నిజాబామాద్, ఆదిలాబాద్ జల్లాల నుంచి పెద్దయెత్తున జనాన్ని తరలించేందుకు ఆ జిల్లాల ఎమ్మెల్యేలకు అప్పగించారు. పార్టీ సీనియర్ నేత బాలమల్లును కూడా దీనికి ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీవన్ రెడ్డి, బాల్క సుమన్ లు నాందేడ్ జిల్లాలో పర్యటించి సభను నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 17న మరో భారీ బహిరంగసభ జరగనుంది.