Loksabha : అదానీ పై ఆగని రగడ.. పార్లమెంటు బయట నిరసన
అదానీ అవినీతిపై దర్యాప్తు జరపాలంటూ ఇండి కూటమి పక్షాల నేతలు పార్లమెంటు బయట ఆందోళనకు దిగారు.
అదానీ అవినీతిపై దర్యాప్తు జరపాలంటూ ఇండి కూటమి పక్షాల నేతలు పార్లమెంటు బయట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలన్నీఈ ఆందోళనలో పాల్గొన్నాయి. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ వంటి పార్టీలు పార్లమెంటు బయట అదానీని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. పార్లమెంటు సమావేశాలు గత కొద్ది రోజుల నుంచి అదానీ అంశంతో వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.
నిన్న సమావేశమైనా...
నిన్న స్పీకర్ ఓం బిర్లా విపక్ష నేతలతో సమావేశమై పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని కోరారు. నిన్నటి సమావేశంలో కొంత సానుకూలంగా స్పందించిన విపక్షాలు ఈరోజు సభ ప్రారంభమయిన వెంటనే ఆందోళనకు దిగాయి. ప్రశ్నోత్తరాలను కూడా అడ్డుకోవడం సరికాదని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.