Sabarimala : శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు.. భారీ వర్షమయినా
శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు భారీ వర్షం కురుస్తుంది
శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు భారీ వర్షం కురుస్తుంది. అయినా లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో సన్నిధానానికి చేరుకుంటున్నారు. పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. అయ్యప్ప దర్శనానికి పది గంటల సమయానికి పైగానే పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.
పది గంటలకు పైగానే...
అయితే గత రెండు రోజులుగా శబరిమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో అయ్యప్ప భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. జోరు వర్షంలోనే అయ్యప్ప సన్నిధానానికి చేరుకుని భక్తులు ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. మండల పూజకు గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకూ భక్తులు దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు. భక్తుల కోసం టిక్కెట్లను ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు.