మహారాష్ట్ర సీఎం ఎంపికలో లేటెస్ట్ అప్ డేట్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పరిశీలకులను నియమించింది;
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పరిశీలకులను నియమించింది. ఈ నెల 5వ తేదీన ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నిర్ణయించారు అయితే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటిస్తారని భావించారు. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం పరిశీలికులను నియమించింది.
పరిశీలకులుగా...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానీని పరిశీలకులుగా బీజేపీ నియమించింది.. ఈ నెల 4వ తేదీన జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఎల్లుండి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి, ఆ మరుసటి రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.