Maharashtra : నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై క్లారిటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో నేడు తేలనుంది. ఈరోజు ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశముంది;

Update: 2024-12-02 02:44 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో నేడు తేలనుంది. ఈరోజు ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశముంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే గెలిచి ఇన్ని రోజులైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తేలలేదు. మూడు పార్టీలనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు చర్చించారు. అత్యధిక స్థానాలను సాధించిన బీజేపీ ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టనుంది.

అందరితో చర్చించి...
అయితే ముఖ్యమంత్రి పదవి ఎవరన్న దానిపై మోదీ, అమిత్ షాలు నిర్ణయిస్తారని మహాయుతి కూటమి నేతలు చెప్పారు. మంత్రి వర్గంలో భాగస్వామ్యంపై కూడా చర్చలు ముగియడంతో పాటు ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ముహూర్తం కూడా నిర్ణయించిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి ఎవరన్నది తేలనుంది.


Tags:    

Similar News