వరద నీటిలో బెంగళూరు
బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది
బెంగళూరు వరద నీటిలో నానింది. బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది. ఆదివారం రాత్రి నుంచి ఒక్కసారి భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయి పోయాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. ఇక నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కొరమంగళ ప్రాంతంలో నీటి వరద ఉధృతి ఎక్కువ గా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రహదారిపై మోకాల్లోతు....
రోడ్లపైకి మోకాళ్ల వరకూ వరద నీరు చేరింది. సిల్క్ బోర్డు సెంటర్ లో ఒక వ్యక్తి వరద నీటిలో చిక్కుకపోగా పోలీసులు అతనిని కాపాడారు. ఇక సోమవారం విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న ఉద్యోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వరద నీటితో పాటు డ్రైనేజీ నీరు కూడా పొంగి ప్రవహిస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పలు ఐటీ సంస్థల్లోనూ నీరు చేరడంతో ఇంటి నుంచే ఉద్యోగం చేయాలని పలు కంపెనీలు ఉత్తర్వులు ఇచ్చాయి.