మార్చి రెండో వారంలో షెడ్యూల్?

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి;

Update: 2024-02-23 11:32 GMT
మార్చి రెండో వారంలో షెడ్యూల్?

as the andhra pradesh elections are approaching,

  • whatsapp icon

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అందుతున్న సమాచారం మేరకు మార్చి 13వ తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పర్యటన తర్వాత...
మార్చి 12, 13 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటన ఉంది. ఈ పర్యటన తర్వాతనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతలుగా నిర్వహించే అవకాశముందని తెలిసింది. 2019 లోనూ ఏడు విడతల్లోనే ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.


Tags:    

Similar News