నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమికులు !
మూడో మనిషి వల్ల తమ ప్రైవసీకి భంగం కలగకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ.. ఓ ప్రేమజంట ఏకంగా నడిరోడ్డుపై..;
బెంగళూరు : వయసులో ఉన్న అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడటం సహజం. అలా ప్రేమలో ఉన్న ప్రేమికులు సాధ్యమైనంత వరకూ ప్రైవసీ కోరుకుంటారు. వీలైనంత వరకూ పార్కులు, సినిమాలు, రహస్య ప్రదేశాలకు వెళ్తుంటారు. మూడో మనిషి వల్ల తమ ప్రైవసీకి భంగం కలగకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ.. ఓ ప్రేమజంట ఏకంగా నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా రెచ్చిపోయింది. సిగ్గు విడిచి నడిరోడ్డుపై రొమాన్స్ చేశారు. వారిని చూసిన పాదచారులు, ఇతర వాహనదారులు హమ్మా.. అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట ప్రధాన రహదారిపై ఓ ప్రేమజంట బైక్ పై వెళ్తోంది. మామూలుగా వెళ్తే.. ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ.. ఆ యువతి బైక్ పెట్రోల్ ట్యాంక్ పై అబ్బాయికి ఎదురుగా కూర్చుని, అతడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించింది. ప్రియుడు ఊరుకుంటాడా మరి. బైక్ నడుపుతూనే ప్రియురాలికి ముద్దులు పెడుతూ.. సరసాలాడాడు.
ఆ మార్గం వచ్చి పోతున్న భారీ వాహనాల్లోని వారు, పాదచారులు వీరిని చూసి అవాక్కయ్యారు. ఇంతకి బరితెగించారని కొందరు ముక్కునవేలేసుకున్నారు. ఎందరు చూసినా.. ఏం మాట్లాడుకున్నా తమకేమీ పట్టనట్లే రొమాన్స్ చేస్తూ వెళ్లారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో కాస్తా వైరల్ అయి.. పోలీసుల దృష్టికి చేరింది. బైక్ నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు చామరాజనగర్ డీఎస్పీ తెలిపారు.