కుంభమేళాకు మరో మూడు రోజులే సమయం
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా మరో మూడు రోజులు మాత్రమే కొనసాగుతుంది.;

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా మరో మూడు రోజులు మాత్రమే కొనసాగుతుంది. ఈ నెల 26వ తేదీతో మహా కుంభమేళా ముగియనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. రోజుకు కోటి మందికి పైగానే ప్రయాగ్ రాజ్ కు వస్తున్నారు. రైళ్లు, ప్రత్యేక బస్సుల్లో వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అరవై కోట్ల మంది వరకూ...
ఇప్పటికే అరవై కోట్ల మంది వరకూ భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా. ఈ మూడురోజులు మరింత ఎక్కువగా భక్తులు తరలి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. శివరాత్రి నాడు భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని భావించి అందుకు తగినట్లుగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.