మహీంద్రా షోరూమ్ లో రైతుకు అవమానం.. నేరుగా ఇంటికే బొలెరో వాహనం

కెంపెగౌడ అనే రైతు.. బొలెరో పికప్ వాహనాన్ని కొనేందుకు జనవరి 21వ తేదీన తుమకూరులోని మహీంద్రా షోరూమ్ కి వెళ్లగా.. అక్కడి

Update: 2022-01-31 06:13 GMT

కొద్దిరోజుల క్రితం కర్ణాటకలోని మహీంద్రా షోరూమ్ లో బొలెరో వాహనం కొనేందుకు వచ్చిన రైతుకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. కెంపెగౌడ అనే రైతు.. బొలెరో పికప్ వాహనాన్ని కొనేందుకు జనవరి 21వ తేదీన తుమకూరులోని మహీంద్రా షోరూమ్ కి వెళ్లగా.. అక్కడి సెల్స్ మెన్ అతడి వేషధారణ చూసి అవమానంగా మాట్లాడాడు. ఆ ఘటనపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. రైతుకు జరిగిన అవమానం పట్ల ఆనంద్ మహీంద్రా అసహనం వ్యక్తం చేశారు.

తాజాగా కెంపెగౌడ ఇంటికే బొలెరో పికప్ ట్రక్కును తీసుకెళ్లి, అందజేశారు. షోరూంలో పని చేసే సిబ్బంది, అధికారులు ఆయనకు క్షమాపణలు చెప్పారు. రైతుకు, ఆయన స్నేహితులకు జరిగిన అవమానం పట్ల తాము చింతిస్తున్నామని, ఇచ్చిన మాటకు కట్టుబడి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తమ వాహనాన్ని స్వీకరించినందుకు కెంపెగౌడకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. కెంపెగౌడకు మహీంద్రా కుటుంబంలోకి స్వాగతం అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మహీంద్రా సిబ్బందే స్వయంగా వాహనాన్ని తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు కెంపెగౌడ. షోరూం సిబ్బంది వాళ్లంతట వాళ్లే వచ్చి వాహనాన్ని డెలివరీ చేశారని, ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదనే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను కోరుకున్న టైంకే వాహనం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.


Tags:    

Similar News