మమత కీలక నిర్ణయం.. జనవరి 3 నుంచి?
మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి కొత్త ఆంక్షలను మమత ప్రభుత్వం అమలులోకి తీసుకు రానుంది.
మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి కొత్త ఆంక్షలను మమత ప్రభుత్వం అమలులోకి తీసుకు రానుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఖచ్చితంగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది.
వారు విధిగా....
ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. యూకే నుంచే వచ్చే విమానాలను రద్దు చేయడం ద్వారా కొంత వరకూ ఒమిక్రాన్ కేసులను కంట్రోల్ చేయవచ్చని భావిస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి నుంచి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకుని వస్తేనే ప్రవేశముంటుంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్ లో కొత్త వేరియంట్ తో పాటు కరోనాను కూడా కంట్రోలు చేయవచ్చని భావిస్తున్నారు. జనవరి 3 నుంచి ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.