ఆల్వా ఎంపిక అందుకేనా?
ఉపరాష్ట్రపతి విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.
ఉపరాష్ట్రపతి విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను ప్రకటించారు. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ అభ్యర్థి మార్గరెట్ ఆల్వా అని తెలిపారు. కర్ణాటకు చెందిన మార్గరెట్ ఆల్వాను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపారు. దీంతో ఎన్నిక అనివార్యమయంది. వచ్చే నెల 6వ తేదీన పోలింగ్ జరగనుంది.
ఐక్యత కోసమే....
విపక్షాల తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గరెట్ ఆల్వా గతంలో గవర్నర్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. గోవా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేశారు. దక్షిణ భారత దేశానికి చెందిన మార్గరెట్ ఆల్వా ను విపక్షాలు ఎంపిక చేయడంలో ఎలాంటి వ్యూహం లేదనే తెలుస్తోంది. ఎందుకుంటే ఉభయ సభల్లో ఎన్డీఏకే మెజారిటీ ఉంది. కేవలం విపక్షాల మధ్య ఐక్యతను చాటుకునేందుకే ఆల్వాను ఎంపిక చేసినట్లు కనపడుతుంది.