షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధర

Update: 2023-06-17 02:37 GMT

దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 55,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 54,100గా ఉండేది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,510గా కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,700 ఉండగా, నేడు 400 పెరగడంతో , గోల్డ్ ధర రూ.55,100కి చేరింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్న 59,670 ఉండగా, నేడు 440 పెరగడంతో, గోల్డ్ ధర రూ.60,110గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,260గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,110గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,420గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,460గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160గాను ఉంది. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,110గా నమోదైంది.

దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 73,100గా ఉంది. శుక్రవారం కూడా ఇదే ధర ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,100.. బెంగళూరులో రూ. 73,000గా ఉన్నాయి.


Tags:    

Similar News