భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ఈ శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లకు బాగా కలిసి వచ్చింది. మార్కెట్లు లాభాల పంట పండిరచాయి.;
సెన్సెక్స్ - 63384, నిఫ్టీ - 18826 వద్ద ముగింపు
ఈ శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లకు బాగా కలిసి వచ్చింది. మార్కెట్లు లాభాల పంట పండిరచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 466.95 పాయింట్లు పెరిగి 63,384.58 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 137.9 పాయింట్లు పెరిగి 18,826 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబర్ 1, 2022 నాటి గరిష్టాలను నేటి మార్కెట్లు దాటడం విశేషం. ఆరున్నర నెలల కిందట రికార్డులు సృష్టిస్తూ సెన్సెక్స్ 63,284.19, నిఫ్టీ 18,812.50 తో ముగిశాయి.
శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. ఈ సెంటిమెంట్‌కి ఎఫ్.టి.ఎస్.ఇ (ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూపు) రీబ్యాలెన్స్ చర్యలు మరింత ఊతమిచ్చాయి. దీనివల్ల రిలయన్స్, విప్రో, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌లోకి నిధుల ప్రవాహం కొనసాగింది. భారత ప్రభుత్వం మెరుగైన రేటింగ్స్ కోసం మూడీ’స్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్‌తో చర్చలు జరపడం కూడా మదుపర్లను ఉత్సాహపరిచింది.