హైకమాండ్ దే ఫైనల్
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని హైకమాండ్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రి చేసినా తమకు అంగీకారమేనని తెలిపింది. సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని నియయమించి శాసనసభ్యుల అభిప్రాయాన్ని సేకరించింది. ఈ కమిటీ హైకమాండ్ తో భేటీ అయి చర్చించనుంది.
ఏకగ్రీవ తీర్మానం...
అనంతరం హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని 137 మంది శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ పెట్టిన తీర్మానాన్ని సిద్ధరామయ్య బలపర్చారని సూర్జేవాలా అనంతరం మీడియాకు వెల్లడించారు. అయితే ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ స్కీమ్ ను అమలు చేయాలని సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.