Summer Effect : మూడు నెలలు భగభగలు.. సెగలే మండిపోతుందట
రానున్న మూడు నెలలు వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి తోడు భారత వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. ఇది కలవరపర్చేదిలా ఉంది. రానున్న మూడు నెలలు వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలో భానుడి భగభగలు మామూలుగా ఉండవని, దీనిని తట్టుకోవడం కష్టమేనని చెబుతున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. దీనిివల్ల ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.