జడ్ కేటగిరీ నాకు వద్దంటే వద్దు

తనకు జడ్ కేటగిరి భద్రత అవసరం లేదని ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు

Update: 2022-02-04 12:13 GMT

తనకు జడ్ కేటగిరి భద్రత అవసరం లేదని ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. లోక్ సభ లో ఆయన కాల్పుల ఘటనపై ప్రసంగించారు. తనపై హత్యా యత్నం జరిగిందన్నారు. తన గొంతు నొక్కే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారన్నారు. తాను దాదాపు మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ప్రజాక్షేత్రంలో తనకు రక్షణ అవసరం లేదని అసుదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

వారికి ఉంటే....?
ప్రజాస్వామ్యంలో ఎవరైనా తన అభిప్రాయాన్ని చెప్పే వీలుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. పేదలకు, మైనారిటీలకు భద్రత ఉంటే తనకు ఉన్నట్లే అని ఆయన తెలిపారు. ఒవైసీ పై కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు కేంద్రమంత్రి పియూష్ గోయల్ వివరించారు. దీనిపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఒక ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.


Tags:    

Similar News