మోదీ సింప్లిసిటీ.. సామాన్య వ్యక్తిని దగ్గరకు పిలిచి..?

కాశీ విశ్వనాథ్ కారిడార్ ను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ వారణాసికి వెళ్లారు. అక్కడ తన సింప్లిసిటీని చాటుకున్నారు;

Update: 2021-12-13 07:35 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాశీ విశ్వనాథ్ కారిడార్ ను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ వారణాసికి వెళ్లారు. అక్కడ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు ప్రధాని. సోమవారం నాడు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సాన్ని పురస్కరించుకుని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. మోదీ రాకతో వారణాసి వీధులన్నీ శివనామస్మరణ, మోదీ నామస్మరణతో మారుమ్రోగాయి. వారణాసి వీధుల్లో ర్యాలీగా వచ్చిన మోదీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆయన వాహనశ్రేణిపై పూలజల్లు కురిపిస్తూ ప్రధానికి జేజేలు పలికారు. ఈ సమయంలో అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

స్వయంగా పిలిచి....
వాహన శ్రేణితో ర్యాలీగా వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. అతడికి సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన మోదీ వాహనాన్ని ఆపి.. అతడిని దగ్గరికి పిలిచారు. స్వయంగా అతనే మోదీకి తలపాగాను అలంకరించి, శాలువాను మెడలో వేశారు. చిరునవ్వుతో వాటిని స్వీకరించిన మోదీ అతనికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత కొంతదూరం వెళ్లాక.. వారణాసిలోని నాలుగురోడ్ల కూడలిలో మోదీ కారు దిగి ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజలకు నమస్కరిస్తూ.. వారి ఆశీర్వాదాలను స్వీకరించారు


Tags:    

Similar News