తెలుగు ఎంపీలతో నేడు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ నేడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది;

Update: 2021-12-15 04:20 GMT

ప్రధాని నరేంద్రమోదీ నేడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం పై మోదీ నేరుగా ఆ ప్రాంత ఎంపీలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ బలోపేతంపై....
కర్ణాటకలో బలంగా ఉన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో కొంత పార్టీ పరవాలేదు. ఇక్కడ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చిస్తారు. నలుగురు ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటన కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ నుంచి జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ లు హాజరుకానున్నారు.


Tags:    

Similar News