బీ అలర్ట్: ఐదు రాష్ట్రాలకు వర్ష సూచన
రుతుపవనాల ప్రభావంతో, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో రాబోయే ఐదు రోజులలో చాలా విస్తారంగా వర్షాలు కురుస్తాయని
దేశంలో రుతుపవనాలు వేగంగా కదులుతుండడం.. అరేబియా సముద్రం నుంచి పశ్చిమగాలులు దేశంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ లలో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షంతో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోకి ప్రవేశించాయని, వచ్చే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD గురువారం తెలిపింది. "నైరుతి రుతుపవనాలు వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య & తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు.. మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని చాలా ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగాయి" అని భారత వాతావరణ శాఖ తెలిపింది.
"నైరుతి రుతుపవనాలు వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని చాలా ప్రాంతాలలో మరింత ముందుకు సాగాయి" అని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం బెంగళూరు, చిక్‌మగ్లూరు, కార్వార్‌లను రుతుపవనాలు కవర్ చేశాయి. రుతుపవనాల ప్రభావంతో, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో రాబోయే ఐదు రోజులలో చాలా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. వచ్చే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది.