ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్
సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తాజా ట్వీట్ కూడా వైరల్ గా మారింది
ఒకవైపు రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తాజా ట్వీట్ కూడా వైరల్ గా మారింది. ఆయన తొలి నుంచి ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది.
ముగ్గురి ఫొటోలతో...
విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీల మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీఫొటోను ఉంచి ట్వీట్ చేశారు. దీంతో పాటు జనరల్ నాలెడ్జ్... ఈ ముగ్గురిలో కామన్ ఏంటి అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీకి మద్దతుగానే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది.