5జీ సేవల గురించి ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఈ కార్యక్రమానికి హాజరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా 5జీ సేవలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు. భారత్ లోని కొన్ని ముఖ్యమైన నగరాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ 5జీ సేవలు అందుబాటులోకి రాన్నాయి. తర్వాత కాలంలో ఇతర ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనున్నాయి. భారత్ లోని మొత్తం 13 నగరాల్లోనూ ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 5జీ సేవలను ప్రారంభించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్ ను కూడా ప్రారంభించారు. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, చండీగడ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి హాజరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని.. ముందుగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల్లో ఈ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. దీపావళి నాటికి ఈ నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అంబానీ స్పష్టం చేశారు. 5జీ ఆధారిత డిజిటల్ సొల్యూషన్స్ చవకైన నాణ్యతతో కూడిన విద్య, నైపుణ్యాలను దేశంలోని సామాన్య పౌరులకు చేరువవుతాయని అన్నారు. 5జీ సేవల దిశగా సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, టెలికాం డిపార్ట్‌మెంట్ కృషి గర్వకారణమన్నారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇప్పుడు అసియన్ మొబైల్ కాంగ్రెష్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88,078 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి.