గిన్నిస్ రికార్డు సాధించిన నాగపూర్ మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణం

ప్రజా రవాణా కోసం ఇలా నిర్మాణాలు చేయడం వల్ల అదనపు భూసేకరణను నివారించవచ్చు. నిర్మాణ సమయం..

Update: 2022-12-07 05:41 GMT

nagpur metro guinness records

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. వార్దా రోడ్డులో ఉన్న 3.14 కిలోమీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో ఈ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఆసియా బుక్, ఇండియా బుక్ నుండి అవార్డులను కైవసం చేసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద మెట్రో నిర్మాణం ఇదే కావడం విశేషం. దీనిపైభాగంలో మెట్రో రైలు, మధ్యలో హైవే ప్లైఓవర్, దిగువన ప్రస్తుతం ఉన్న రోడ్డు కొనసాగుతోంది.

ప్రజా రవాణా కోసం ఇలా నిర్మాణాలు చేయడం వల్ల అదనపు భూసేకరణను నివారించవచ్చు. నిర్మాణ సమయం.. ప్రాజెక్ట్ వ్యయం తగ్గుతుంది. ప్లై ఓవర్ హైవే తొమ్మిది మీటర్ల ఎత్తులో, మెట్రో 20 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ బహుళ లేయర్డ్ కారిడార్‌లో 2.7 కి.మీ రెండవ స్థాయిలో నాలుగు లైన్ల రహదారి ఉండగా, అర కిలో మీటరు ఆరు లైన్ల రహదారిని కలిగి ఉంది. అలాగే విమానాశ్రయానికి వెళ్లేవారికి 4 నిమిషాల సమయం ఆదా అవుతుంది. నాగ్‌పూర్ మెట్రో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినందుకు ఎన్‌హెచ్‌ఏఐ, మహా మెట్రోకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుస ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు.





Tags:    

Similar News