ఉగ్రవాదంపై రాజీ లేని పోరు
ఉగ్రవాదం పై రాజీపడే ప్రసక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. "నో మనీ ఫర్ టెర్రర్" సదస్సు లో ఆయన ప్రసంగించారు
ఉగ్రవాదం పై రాజీపడే ప్రసక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన "నో మనీ ఫర్ టెర్రర్" సదస్సు లో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదం అంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై దాడి అని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి హద్దులు లేవని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి తొలగించినప్పుడే దాని నుంచి బయటపడతామని మోదీ అన్నారు.
నిధులు అందకుండా...
ఏకీకృత విధానమే ఉగ్రవాదాన్ని ఓడించగలదని మోదీ అభిప్రాయపడ్డారు. తీవ్రవాద సంస్థలు అనేక మార్గాల ద్వారా నిధులు సంపాదించుకుంటున్నాయన్నారు. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానాల్లో భాగంగా ఉగ్రవాదానికి మద్దతిస్తుండటం విచారకరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమిష్టిగా పోరాడాల్సిని అవసరం ఎంతైనా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.