సూపర్ న్యూస్.. కరోనా తగ్గినట్లే
ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. కొన్ని నెలల తర్వాత కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. కొన్ని నెలల తర్వాత కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రెండు వేల లోపు కేసులు నమోదు కావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. ఒక్కరోజులో 2,09,801 మంది కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 1,968 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రికవరీ రేటు 98.74 శాతంగా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
రెండువేలకు ....
ఇప్పటి వరకూ భారత్ లో 5,28,716 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడగా వారిలో 4.40 కోట్ల మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో 34,598 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 218.80 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.