మరోసారి అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్ కేసులు నమోదవుతుండగా,
దేశంలో కరోనా మరోసారి అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతోంది. గతంలో కరోనా ఇబ్బందులను గుర్తు చేసేలా మరోసారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఏపీలోనూ కరోనా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్ కేసులు నమోదవుతుండగా, రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్త వేరియంట్‌పై అనుమానాలతో అతడి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు.
ఇక కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైంది ప్రభుత్వం. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై నేడు సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైన జగన్ రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టీటీడీ కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టారు.
జేఎన్-1తో జాగ్రత్త..
కరోనా కొత్త వేరియంట్ JN-1 ప్రభావం మెల్లిగా విస్తరిస్తోంది. దేశంలో కొత్త కరోనా బెంబేలెత్తిస్తోంది. కొత్తగా 594 కేసులు నమోదు కాగా, కేరళలోనే అత్యధికం 300 కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓవైపు చలి విజృంభణ.. మరోవైపు కొవిడ్ భయం.. ఇప్పటికే జలుబు, దగ్గుతో ప్రజల ఇబ్బందులు పడుతుండగా, కొత్త వేరియంట్ కారణంగా మాస్క్ మస్ట్ అంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అయితే
తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు
ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కావడం భయాందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20 చేరింది. కరోనా వ్యాప్తితో జీఎంహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మాస్క్ లేనిదే ఆస్పత్రిలోకి అనుతించబోమంటున్నారు సిబ్బంది.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్యులు:
ఆంధ్రప్రదేశ్‌లో ఒక కరోనా కేసు నమోదు కాగా, అక్కడి ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఏపీలో కొవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.