విదేశాల నుంచి భారత్ కు వచ్చేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ఇకపై విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎలాంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని
భారత్ లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ల తీవ్రత ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సవరించింది కేంద్రం. గతంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్న దేశాలను హై రిస్క్ దేశాలుగా పరిగణించింది కేంద్రం. తాజాగా ఈ కేటగిరీని తొలగించింది. అలాగే విదేశాల నుంచి వచ్చినవారు ఏడురోజులపాటు క్వారంటైన్లో ఉండాలన్న నిబంధననూ ఎత్తివేసింది.
Also Read : మహేష్ - విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్
ఇకపై విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎలాంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే వారు స్వీయ ధ్రువీకరణను ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఎయిర్ సువిధ పోర్టల్ లో ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. కరోనా నెగెటివ్ అంటూ ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్షా రిపోర్ట్ ను సమర్పించాలి. లేదంటే తాము రెండు డోసుల టీకా తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ నిబంధనలను పాటించిన వారినే ప్రయాణానికి అనుమతించాలని ఎయిర్ లైన్స్ సంస్థలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ.