మైనర్లకు వాహనాలు ఇచ్చారో.. ఇక అంతే.. మారుతున్న రూల్స్
రవాణశాఖలో జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
రవాణశాఖలో జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే 25,000 జరిమానా విధించనున్నారు.జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధించాలని రవాణా శాఖ నిర్ణయించింది.
ఇరవైఐదు వేల జరిమానా...
అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వందల రూపాయల జరిమానా వేయనున్నారు. మైనర్ వాహనం నడిపితే ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తారు. దీంతో పాటు మైనర్ కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించనున్నారు.